Updated Apr 12, 2019 · v4.0
Sri Shiridi Saibaba satcharitra in sisa padyam
అందరికి నమస్కారం శ్రీ షిరిడీ సాయి కృపతో మా తంద్రిగారైన స్వర్గీయులు గొర్తి సూర్యనారాయణ శర్మ గారు బాబా జీవిత సత్చరిత్రను పద్య రూపమున రచించిరి. ఈ పద్యాలు బాబా భక్తులందరికి చెరాలని వారి కొరిక. అందున ఈ పద్యాలను వారు సులభమైన పదాలతో అందరికీ అర్ధమైయ్యేలా రచించారు. ఈ పద్యములతొ సాయి భక్తులు బాబా జివిత సచ్చరిత్ర పారాయణ మరియు భజనలు చెసి తరించాలని, శ్రీ షిరిడీ సాయి కృపతో మా తండ్రిగారు రచించిన ఈ సత్చరిత్రను భక్తులకు ఈ APP ద్వారా అందజేయ మా ఈ ప్రయత్నం. శుక్లామ్బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాన్తయే ||సీ.|| రచయిత ఎవ్వడు? రచయించుటెయ్యది? రచన ఏది? తలల రాత రచన నలువచేయగలేద? విలువకట్ట తరమె కావ్యరచనజేయు కవులమనసు సాయిదీవెనలంది సంతోషమున నేను పద్యరచన చేయనుద్యమించి సీసపద్య రచన రసవత్తవరంబుగా సాగుచుండ మనస్సు శాంతి బొంది ||తే.గీ.|| సాయి జీవిత చరిత మాసాంతముగను రాగరంజిత మగునట్లనుగ్రహించి సూర్యనారాయణు వినతి కరుణ గనవె సకల సద్గుణధామ శ్రీ సాయిరామ ||౧||
7 years on Google Play
This app isn't currently appearing in any tracked top charts.